BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 09:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడులో కార్తీక దీపోత్సవం.. దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:28 PM
4 వీక్షణలు

 జిల్లా ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి – మంత్రి కొలుసు పార్థసారథి భక్తులతో కలిసి కార్తీక దీపాలు వెలిగించిన మంత్రి దంపతులు

నూజివీడు, నవంబరు 25: కార్తీక మాసం పవిత్రతను చాటుతూ నూజివీడు పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పట్టణంలోని మార్కెట్ యార్డు ప్రాంగణం వేలాది కార్తీక దీపాల వెలుగులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఆయన సతీమణి కొలుసు కమలాలక్ష్మి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి దంపతులు తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం వేలాది మంది భక్తులతో కలిసి స్వయంగా కార్తీక దీపాలను వెలిగించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దీపారాధన చేయడంతో మార్కెట్ యార్డు ప్రాంగణమంతా దీపకాంతులతో నిండిపోయింది. శివనామస్మరణలు, భక్తి గీతాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ కార్తీక మాసం హరిహరులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర మాసమని, ఈ మాసంలో దీపారాధనకు ప్రత్యేక విశిష్టత ఉందని తెలిపారు. దీపం జ్ఞానానికి, శాంతికి, సమృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడమే కాకుండా సోదరభావం, ఐక్యత, శాంతి సామరస్యాలను బలోపేతం చేస్తాయని అన్నారు. నూజివీడు పట్టణంతో పాటు పరిసర గ్రామాలు కార్తీక దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోవడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని పరమేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై భగవంతుడి కరుణాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఇలాంటి పవిత్ర వేడుకలను పట్టణాలు, గ్రామాల్లో ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు మున్సిపల్ చైర్మన్ బర్రె ఇళయరాజా, వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మంత్రి సతీమణి కొలుసు కమలాలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంపటి అరుణ, నూజివీడు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు కాపా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వేదపండితులు, అర్చకులు, అభిమానులు, మహిళలు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.