BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 09:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రాతూరులో బాలల రక్షణపై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:40 PM
6 వీక్షణలు

బాలలపై వేధింపులు, దోపిడీని అరికట్టేందుకు సమష్టి కృషి అవసరం బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. ఆపదలో 1098కు ఫోన్ చేయాలి పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించాలి: అత్తోట పోతురాజు

తాడేపల్లి: బాలబాలికలపై జరుగుతున్న వేధింపులు, హింస, దోపిడీని అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని అత్తోట పోతురాజు పిలుపునిచ్చారు. చిన్నారులకు సురక్షితమైన వాతావరణం కల్పించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల బాధ్యత అని స్పష్టం చేశారు. తాడేపల్లి మండలం ప్రాతూరు గ్రామంలో బుధవారం గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాలబాలికలకు బాలల హక్కులు, రక్షణ, వేధింపుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తోట పోతురాజు మాట్లాడుతూ, చిన్నారులు శారీరక, మానసిక, లైంగిక వేధింపులతో పాటు ఆర్థిక దోపిడీ, బాల కార్మికత్వం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో పెద్దలు వారికి అండగా నిలిచి సరైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. వేధింపులకు గురైనప్పుడు పిల్లలు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా విశ్వసనీయమైన పెద్దలకు విషయాన్ని తెలియజేయాలని అన్నారు. బాలలపై జరిగే హింసను నిర్లక్ష్యం చేయకుండా, బాధిత చిన్నారులకు అవసరమైన సహాయం, కౌన్సెలింగ్, మానసిక ధైర్యం కల్పించాలని పేర్కొన్నారు. బాలల సమస్యలను వ్యక్తిగత అంశాలుగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించి అందరూ కలిసి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల లోపు పిల్లల శారీరక, మానసిక, లైంగిక శ్రేయస్సుకు హాని కలిగించే ఎలాంటి చర్యనైనా ఉపేక్షించకూడదని తెలిపారు. బాలలపై వేధింపులు జరిగినట్లు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఆపదలో ఉన్న చిన్నారులకు సహాయం అందించేందుకు అందుబాటులో ఉన్న 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్‌పై అవగాహన కల్పించారు. పిల్లలు లేదా వారి పరిస్థితి గురించి తెలిసిన ఎవరైనా ఈ నంబర్‌కు ఫోన్ చేసి సహాయం కోరవచ్చని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 ద్వారా పోలీసుల సహాయం పొందవచ్చని తెలిపారు. అలాగే బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో–2012) గురించి వివరించి, ఈ చట్టం ద్వారా చిన్నారులకు కల్పించిన రక్షణ, నేరాలకు సంబంధించిన శిక్షలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ బాలల పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.