BREAKING
thumb ● ఆర్మూర్ మండలంలో 77 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు thumb ● ఆర్మూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● ఆర్మూర్ మండలంలో 77 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు thumb ● ఆర్మూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య
Test 4
Date of Publish : 08 November 2026, 03:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఖమ్మంలో కత్తులు, గొడ్డళ్లతో యువకుల హల్‌చల్.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Nov, 2026 - 03:50 PM
34 వీక్షణలు

ఖమ్మం నగరంలో సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు కోసం కొందరు యువకులు ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నారు. లైకులు, వీక్షణలు పెంచుకోవాలనే ఉద్దేశంతో కత్తులు, గొడ్డళ్లతో విన్యాసాలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా వీడియోలు రూపొందిస్తున్న ఇద్దరు యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పంపింగ్ వెల్ రోడ్డు ప్రాంతానికి చెందిన దొడ్ల చరణ్, దమళ్ల సూర్యలను పోలీసులు పట్టుకుని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు కోసం కత్తులు, గొడ్డళ్లు వంటి మారణాయుధాలతో వీడియోలు రూపొందించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత సామాజిక మాధ్యమాల ప్రభావానికి లోనుకాకుండా, ప్రమాదకరమైన విన్యాసాలకు దూరంగా ఉండాలని సూచించారు.