BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 04:05 pm
Posted by : PAGADALA DEVAIAH

LB Nagar: చలో ఢిల్లీ పార్లమెంట్ మార్చ్ వాల్ పోస్టర్ విడుదల

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
26 Nov, 2026 - 04:05 PM
11 వీక్షణలు

లేబర్ కోడ్స్ రద్దు, కనీస వేతనం రూ.42 వేలు, పెన్షన్ల పెంపు తదితర డిమాండ్లతో డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో ఆందోళన

ఎల్బీనగర్, నవంబర్ 26 – ఎన్ టుడే న్యూస్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని చైతన్యపురి ఆటో స్టాండ్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేశారు. కే. రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆటో స్టాండ్ కార్మిక యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి. చైతన్య, రంగారెడ్డి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు మల్లెపాక వీరయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, కనీస వేతనాన్ని రూ.42 వేలకు పెంచాలని, కనీస పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో జరిగే పార్లమెంట్ మార్చ్‌లో కార్మికులు పాల్గొనాలని సీఐటీయూ పిలుపునిచ్చిందని తెలిపారు.

స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినా కార్మికుల వేతనాలు, ఆదాయం, పెన్షన్లలో ఆశించిన స్థాయిలో పెరుగుదల లేదని వారు విమర్శించారు. కార్మికులు తమ శ్రమతో సంపద సృష్టిస్తుంటే, దాని ప్రయోజనాలను యజమానులు పొందుతున్నారని ఆరోపించారు. కార్మిక సంక్షేమం కంటే కార్పొరేట్ పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకే పాలకవర్గాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు.

అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి పారిశ్రామిక సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా పాలకవర్గాల విధానాలు కొనసాగుతున్నాయని వారు ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర సంస్థలను ప్రైవేటు ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కార్మికుల ప్రజాస్వామ్య హక్కులపై నిర్బంధం కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ సర్కిల్ ఆటో స్టాండ్ యూనియన్ కార్యదర్శి కడారి రాములు, ఎం.డి. లతీఫ్, కమిటీ సభ్యులు కే. చంద్రయ్య, ఆటో డ్రైవర్లు కుంటిగొర్ల రాములు, జగదీష్ యాదవ్, జి. రాములు, పాండు రెడ్డి, సాజత్, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆటో స్టాండ్ కార్మికులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.