BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు
Date of Publish : 02 October 2026, 08:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గాంధీ జయంతి వేళ ప్రజాస్వామ్య పరిరక్షణకు వామపక్షాల గళం...

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Oct, 2026 - 08:33 PM
6 వీక్షణలు

గాంధీ జయంతి వేళ ప్రజాస్వామ్య పరిరక్షణకు వామపక్షాల గళం.. విజయవాడలో భారీ ప్రదర్శన

ప్రజాస్వామ్య పరిరక్షణకు వామపక్షాల ప్రదర్శన ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలి లెనిన్ సెంటర్‌లో బహిరంగ సభలో వామపక్ష నేతల డిమాండ్

విజయవాడ, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’, ‘ఓట్ చోర్ గద్దీ ఛోడ్’, ‘ఎస్‌ఐఆర్‌ రద్దు చేయాలి’ అనే నినాదాలతో నేతలు తమ నిరసనను వ్యక్తం చేశారు.

సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణపై వివాదాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. తొలగించినట్లు పేర్కొంటున్న 35 లక్షల మంది ఓటర్ల పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని, దేశవ్యాప్తంగా 30 కోట్ల ఓటర్లకు సంబంధించిన అంశంపై సమగ్ర పరిశీలన చేపట్టాలని కోరారు. ఐదు రాష్ట్రాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈవీఎంల విధానాన్ని రద్దు చేసి, బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని హరినాథ్‌ పేర్కొన్నారు.

అంతకుముందు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజా ప్రదర్శన నిర్వహించి లెనిన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభకు సీపీఐ నేత కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల జాబితాల్లో పారదర్శకత, ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత వంటి అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యురాలు అక్కినేని వనజ, ఏబీ వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, మాస్‌లైన్‌ నేత సి. భాస్కరరావు, కాంగ్రెస్‌ నేత నరహరిశెట్టి, సీపీఐ ఎంఎల్‌ నేత జె. కిషోర్‌బాబు, గోవర్ధన్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి శ్రీనివాసరావు, ఏఐసీసీటీయూ నేత ఉదయ్‌ కిరణ్‌ ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.