BREAKING
thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
Test 4
Date of Publish : 22 September 2026, 10:27 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

చంద్రప్రభ వాహనంపై శ్రీవారి విహారం...

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Sep, 2026 - 10:27 AM
56 వీక్షణలు

తిరుపతి.

తిరుమల

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన ఈ వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

చంద్రప్రభ వాహనం వెన్నెల కాంతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా అలంకరించడంతో ఉత్సవమూర్తి మలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా దర్శనమిచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూషణంగా ఉంటాడని పురాణాల్లో పేర్కొనగా, శ్రీహరికి వాహనంగా చంద్రప్రభ రూపంలో దర్శనమివ్వడం ఈ సేవలోని విశిష్టతగా భక్తులు భావిస్తారు.

చంద్రప్రభ వాహన సేవను దర్శించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపాలు తొలగి మనశ్శాంతి కలుగుతుందని విశ్వాసం. స్వామివారి వాహన సేవ సందర్భంగా నాలుగు మాడ వీధుల్లో భక్తులు గోవింద నామస్మరణతో మార్మోగించారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రతి వాహనానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండగా, చంద్రప్రభ వాహన సేవ ప్రశాంతత, చల్లదనం, భక్తిభావానికి ప్రతీకగా నిలుస్తుంది.