BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 08:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మారేడుమిల్లి అడవుల్లో 69 వేట ఉచ్చులు తొలగింపు

ఆంధ్రప్రదేశ్
/ అల్లూరి సీతారామరాజు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 08:27 AM
27 వీక్షణలు

వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు తప్పించిన అటవీ సిబ్బంది.. విధి నిర్వహణపై పవన్ కళ్యాణ్ అభినందనలు అడవుల్లో నిఘా, గస్తీ మరింత పటిష్టం చేయాలని ఆదేశం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ వేటగాళ్ల ఉచ్చులకు అటవీ శాఖ సిబ్బంది అడ్డుకట్ట వేశారు. ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి ఏకంగా 69 వేట ఉచ్చులను గుర్తించి తొలగించారు. వన్యప్రాణులను లక్ష్యంగా చేసుకుని మూడు చక్రాల వాహనాలకు ఉపయోగించే బ్రేక్ వైర్లతో ఏర్పాటు చేసిన ఈ ఉచ్చులను గుర్తించడం ద్వారా అనేక మూగజీవుల ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించారు. బుధవారం మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని కంపార్ట్‌మెంట్ నంబర్ 26/4లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అడవిలో అక్రమంగా అమర్చిన 69 వేట ఉచ్చులు బయటపడ్డాయి. వెంటనే వాటిని తొలగించి వన్యప్రాణులకు రక్షణ కల్పించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో పాల్గొన్న అటవీ సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, జంతు జాడలను గుర్తించే సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బందిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అడవుల్లో నిరంతర గస్తీ, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తత, సమష్టి కృషి వల్ల వన్యప్రాణులకు ఎదురైన ముప్పును నివారించగలిగామని పేర్కొన్నారు. అటవీ సంపదతో పాటు అరుదైన వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అడవుల్లో ఏర్పాటు చేసే ప్రతి ఉచ్చు ఒక మూగజీవి ప్రాణాన్ని బలితీసుకునే ప్రమాదం ఉందని, ఇలాంటి ఉచ్చులను ఎప్పటికప్పుడు గుర్తించి తొలగించడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. అక్రమ వేటను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా, ప్రత్యేక పెట్రోలింగ్‌ను మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మూడు చక్రాల వాహనాల బ్రేక్ వైర్లను వేట ఉచ్చుల తయారీకి దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఆటోమొబైల్ దుకాణాల యజమానులు, మోటార్ మెకానిక్‌లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బ్రేక్ వైర్ల వినియోగంపై అప్రమత్తత పెంచడం ద్వారా అక్రమ వేటకు అవసరమైన సామగ్రి దుర్వినియోగాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే స్థానిక ప్రజలను కూడా వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములను చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అటవీ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వేటగాళ్ల కదలికలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. 69 ఉచ్చుల తొలగింపుతో అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు చేపట్టిన చర్యలు మరోసారి ప్రాధాన్యత సంతరించుకున్నాయి.