BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 05:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర క్రీడాకారిణికి ఘన సన్మానం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో నేషనల్ కబడ్డీ ప్లేయర్ బి. హనీకి గౌరవం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 05:48 PM
62 వీక్షణలు

మధిర, ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో మధిర మండలం మునగాల కృష్ణాపురం గ్రామానికి చెందిన నేషనల్ కబడ్డీ క్రీడాకారిణి బి. హనీ ఘన సత్కారం అందుకున్నారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, జిల్లా క్రీడా యువజన అధికారి సునీల్ రెడ్డి చేతుల మీదుగా హనీని ఘనంగా సన్మానించారు.

మునగాల కృష్ణాపురం గ్రామానికి చెందిన బి. హనీ, అరుణ కుమార్తె. ప్రస్తుతం మధిరలోని శ్రీనిధి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కబడ్డీ క్రీడలో ప్రతిభ కనబరుస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేరళ రాష్ట్రం కొల్లంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.

జాతీయ స్థాయిలో కబడ్డీ క్రీడలో రాణిస్తున్న హనీకి లభించిన ఈ గౌరవంపై కుటుంబ సభ్యులు, శ్రీనిధి కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.