BREAKING
thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ
Date of Publish : 04 October 2026, 07:10 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర మండల స్థాయి జనరల్ బాడీ సమావేశం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Oct, 2026 - 07:10 AM
12 వీక్షణలు

అభివృద్ధి పనులపై సమీక్ష.. సర్పంచుల సందేహాలకు అధికారుల సమాధానాలు

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం మండల స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ ప్రత్యేక అధికారి జి. గంగాధర్ ప్రత్యేక అతిథిగా హాజరుకాగా, మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం జరిగింది. మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి. నరసింహారావు సమావేశానికి హాజరై మండలంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

సమావేశంలో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆయా శాఖల పరిధిలో మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి అధికారులు సర్పంచులకు వివరించారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, వివిధ శాఖల పనితీరుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచులు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు సంబంధిత శాఖల అధికారులు సమాధానాలు ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు.

సమావేశం ముగింపు సందర్భంగా హాజరైన సర్పంచులు, మండల స్థాయి అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్, పాత్రికేయులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.