BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 06:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర శ్రీనిధి జూనియర్ కళాశాలలో మిషన్ వాత్సల్యపై అవగాహన సదస్సు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 06:43 PM
18 వీక్షణలు

బాలల హక్కులు, మహిళా భద్రత, బాల్య వివాహాల నివారణపై విద్యార్థులకు అవగాహన

ఖమ్మం జిల్లా, మధిర: స్థానిక శ్రీనిధి జూనియర్ కళాశాలలో గురువారం మిషన్ వాత్సల్య కార్యక్రమంలో భాగంగా బాలల హక్కులు, బాలల రక్షణ చట్టాలు, మహిళా భద్రత, బాల్య వివాహాల నివారణ, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, చైల్డ్ హెల్ప్‌లైన్ తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీనిధి విద్యా సంస్థల అధినేత అనిల్ కుమార్ నెహ్రూ సూచనల మేరకు కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సదస్సుకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్. యశోద ముఖ్య అతిథిగా హాజరై బాలల సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణ, ఆపదలో ఉన్న చిన్నారులకు అందుబాటులో ఉన్న సహాయ సేవలు, చట్టపరమైన రక్షణ చర్యల గురించి వివరించారు. బాలలపై జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాలలపై జరిగే నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే పోక్సో చట్టం, సెక్షన్ 19 ప్రకారం బాలలపై లైంగిక నేరాలు జరిగినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఎలా అందించాలనే విషయాలను వివరించారు. ఆపదలో ఉన్న బాలలకు తక్షణ సహాయం అందించేందుకు చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

అదేవిధంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలతో పాటు కుటుంబ సంబంధాలు, సామాజిక జీవనం, ఆర్థిక పరిస్థితులపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. బాలల భద్రత, మహిళల రక్షణ, సమాజంలో చట్టాలపై అవగాహన పెంపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.