BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 06:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో మాలల ఆత్మీయ సమ్మేళనం మహోత్సవం – 2026 నవంబర్ 29న భారీ స్థాయిలో నిర్వహణ.. 2 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 06:43 PM
21 వీక్షణలు

ఖమ్మం జిల్లా, మధిర: మాలల ఐక్యత, ఆత్మగౌరవం, సామాజిక చైతన్యం, సంఘటిత శక్తిని చాటిచెప్పే లక్ష్యంతో మధిరలో ఈ నెల 29వ తేదీన మాలల ఆత్మీయ సమ్మేళనం మహోత్సవం–2026 నిర్వహించేందుకు మాల మహానాడు మధిర నియోజకవర్గ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికి పైగా మాల సోదర సోదరీమణులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలైన సమానత్వం, విద్య, సామాజిక న్యాయం, ఆత్మగౌరవ స్ఫూర్తితో ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. మాల కుటుంబాల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడం, యువతలో విద్యా చైతన్యాన్ని పెంపొందించడం, సామాజిక హక్కులపై అవగాహన కల్పించడం, భావితరాలకు ఐక్యత సందేశాన్ని అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను ఘనంగా సన్మానించడంతో పాటు ఆత్మీయ పలకరింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక వనసమారాధన నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే వివిధ కమిటీలను ఏర్పాటు చేసి ఆహ్వానాలు, ప్రచారం, వాహనాల నిర్వహణ, భోజన ఏర్పాట్లు, వేదిక అలంకరణ తదితర బాధ్యతలను అప్పగించారు. మధిర పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల మాల సోదర సోదరీమణులు, మహిళలు, యువత, ఉద్యోగులు, విద్యావంతులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ నెల 29వ తేదీ ఆదివారం అత్కూరు–తునికిపాడు రహదారిలో ఎలినా కంపెనీ పక్కన ఉన్న మామిడి తోటలో ఈ మహోత్సవం జరగనుంది. ఐక్యత, ఆత్మగౌరవం, సామాజిక చైతన్యానికి వేదికగా ఈ సమ్మేళనం నిలవనుందని నిర్వాహకులు పేర్కొన్నారు.