చికిత్స అనంతరం మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
తెలంగాణ
/
హన్మకొండ
హన్మకొండ జిల్లా, శాయంపేట: మండలంలోని నేరేడుపల్లికి చెందిన నాగరాజు (38) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితం ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న సమయంలో నాగరాజు ఎడమ కాలు రోటావేటర్‌లో పడి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటన అనంతరం ఖమ్మంలో చికిత్స పొందినప్పటికీ కాలికి ఇన్‌ఫెక్షన్ సోకడంతో మరోసారి శస్త్రచికిత్స చేసినట్లు స్థానికులు తెలిపారు. పరిస్థితి పూర్తిగా మెరుగుపడకపోవడంతో సుమారు పది రోజుల క్రితం వైద్యులు కాలును తొలగించాల్సి ఉంటుందని సూచించినట్లు చెప్పారు.
ఈ విషయం తెలిసిన తర్వాత నాగరాజు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.