BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 06:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి రైతులకు మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు సూచన

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 06:59 PM
21 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రం – ఖమ్మం జిల్లా కోట్యానాయక్ తండాలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి రైతులకు మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు సూచన

కోట్యానాయక్ తండా: యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు రైతులకు సూచించారు. సర్పంచ్ జాటోత్ ఉమారాణి అధ్యక్షతన కోట్యానాయక్ తండాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు తగ్గే అవకాశం ఉండటంతో పాటు చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వరికి బదులుగా పెసర, మినుములు, జొన్న, వేరుశనగ, కూరగాయలు వంటి తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. పంట మార్పిడి వల్ల భూసారం పెరగడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గి మెరుగైన ఆదాయం పొందవచ్చని వివరించారు. అనంతరం రైతు ధరావత్ బద్రి సాగు చేసిన పెసర, మినుము, కంది పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ భరత్, విద్యుత్ శాఖ ఏఈ, పశువైద్యాధికారి సురేష్, ఏఈఓ పూజిత, పలువురు రైతులు పాల్గొన్నారు.