BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 02:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మోటకట్ల అభివృద్ధే ధ్యేయం.. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 02:47 PM
28 వీక్షణలు

 సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వంగిమళ్ల శివప్రసాద్ రెడ్డి పార్టీలకతీతంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తా

అన్నమయ్య జిల్లా, సంబేపల్లి: గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మోటకట్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ వంగిమళ్ల శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన ప్రజాసేవపై ఆసక్తితో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గ్రామంలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సంబంధిత అధికారుల నుంచి ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని ఆయన అందుకున్నారు.

ఈ సందర్భంగా నూతన సర్పంచ్ వంగిమళ్ల శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి సర్పంచ్‌గా అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిన్నమండెం జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువ నాయకులు మౌర్యా రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువతతో పాటు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

సర్పంచ్ పదవిని హోదాగా కాకుండా గ్రామ ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఏ ఒక్కరూ తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇబ్బంది పడకూడదని, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.

ముఖ్యంగా గ్రామంలో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువ నాయకులు మౌర్యా రెడ్డిల సహకారంతో ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరువ చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు.

గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడంతో పాటు విద్య, పారిశుధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై గ్రామ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందరినీ కలుపుకొని మోటకట్ల గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని వంగిమళ్ల శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.