BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 10:02 am
Posted by : K MAHESH

29న హన్మకొండలో ‘మాసివ్ అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ ఫెస్ట్ – సీజన్ 2

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 10:02 AM
13 వీక్షణలు

సాగంటీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దిశగా 100 మందికి పైగా చిన్నారులతో ఒకే భారీ కాన్వాస్‌పై చిత్రలేఖనం

హన్మకొండ:

సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ అండ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మాసివ్ అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ ఫెస్ట్ – సీజన్ 2’ కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీ ఆదివారం హన్మకొండలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు, చీఫ్ అడ్జుడికేటర్ డాక్టర్ మంజుల సాగంటి తెలిపారు. సాగంటీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (MSME రిజిస్టర్డ్) సాధించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మంజుల సాగంటి మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీయడంతో పాటు చిత్రకళా రంగంపై ఆసక్తిని పెంపొందించి, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా చిన్నారులు ఒకే భారీ కాన్వాస్‌పై తమ కుంచెలతో అబ్‌స్ట్రాక్ట్ చిత్రాలను వేయనున్నట్లు వివరించారు.

కార్యక్రమంలో పాల్గొనే ప్రతి చిన్నారికి ప్రోత్సాహకంగా బుక్ ఆఫ్ రికార్డ్ మెడల్, గుర్తింపు పొందిన బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్‌తో పాటు ప్రత్యేక ‘సాగంటీస్ క్రియేషన్స్’ DIY కిట్‌ను అందజేయనున్నట్లు తెలిపారు.

ఆసక్తి గల చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఈ నెల 28వ తేదీలోపు పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. రిజిస్ట్రేషన్లు, ఇతర వివరాల కోసం 8143643337 నంబరులో సంప్రదించాలని సూచించారు.