మున్సిపల్ చైర్మన్ పదవికి అవకాశం కల్పించాలి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధను కలిసిన మాజీ జడ్పీటీసీ గద్దె రమణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు గద్దె రమణ తన అనుచరులతో కలిసి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధను ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవి రిజర్వేషన్ ఓసీ కేటగిరీకి కేటాయించే అవకాశం ఉంటే, చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు కల్పించాలని గద్దె రమణ కోరినట్లు సమాచారం.
తిరువూరు ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం తాను, తన అనుచరులు చేపడుతున్న కార్యక్రమాలను గద్దె రమణ వివరించినట్లు తెలిసింది. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక, స్థానిక రాజకీయ పరిస్థితులు, ఎన్నికల కార్యాచరణపై గద్దె అనురాధతో గద్దె రమణ చర్చించినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో గద్దె రమణతో పాటు ఆయన అనుచరులు పాల్గొన్నారు.