దుర్గామాత విగ్రహాన్ని ఆవిష్కరించిన కొక్కిరాల సురేఖ మేయర్ ధర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్‌లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సీసీసీ కార్నర్ చౌరస్తా వద్ద దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దుర్గామాత ఆగమన్ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్ కొక్కిరాల సురేఖ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య ముఖ్య అతిథులుగా హాజరై భక్తుల సమక్షంలో దుర్గామాత భవాని దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేఖమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దుర్గామాత దివ్య ఆశీస్సులు మంచిర్యాల ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..ఇంతటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులను, వారికి పూర్తి సహకారం అందించిన మేయర్ ధర్ని మధుకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమానంతరం దేవాలయ కమిటీ ప్రతినిధులు సురేఖను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో మంచిర్యాల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, వివిధ వార్డుల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.