BREAKING
thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Test 4
Date of Publish : 26 November 2026, 07:16 am
Posted by : VALLAPU KOTESH

మూల మలుపుల్లో ప్రమాదాల నివారణకు చర్యలు

తెలంగాణ
/ నల్గొండ / నాంపల్లి
Reporter
Vallapu Kotesh Nampally Mandal
26 Nov, 2026 - 07:16 AM
65 వీక్షణలు

ప్రమాదకర మలుపుల వద్ద వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలి

నాంపల్లి–గుర్రంపోడు రహదారిపై ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి: బొమ్ము చంద్రశేఖర్ యాదవ్

నాంపల్లి: నాంపల్లి నుంచి గుర్రంపోడు, మర్రిగూడ, చండూరు, కొండమల్లేపల్లి, పెద్దవూర మండలాలకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారుల్లోని ప్రమాదకరమైన మూలమలుపుల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని యాదవ సంఘం నాయకుడు బొమ్ము చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు.

బుధవారం సాయంత్రం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నాంపల్లి మండలం నుంచి వెళ్లే ప్రధాన రహదారిలో మహమ్మదాపురం సమీపంలోని రెండు గుట్టల మధ్య ఉన్న ప్రమాదకరమైన మూలమలుపుల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు వరుసల బీటీ రహదారి ఉండటంతో వాహనదారులకు మూలమలుపులు సరిగ్గా కనిపించడం లేదని, వేగంగా వచ్చే వాహనాలు మలుపుల వద్ద నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటికే ఈ మలుపుల వద్ద జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారని పేర్కొన్నారు. కాళ్లు, చేతులు విరిగి శాశ్వత వైకల్యంతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ యజమానులు మృత్యువాత పడటంతో వారి భార్యాపిల్లలు దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇదే రహదారిపై కూల్‌డ్రింక్స్‌తో వెళ్తున్న వాహనం ఓ మలుపు వద్ద బోల్తాపడటంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారని గుర్తుచేశారు.

ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరమైన మలుపుల వద్ద వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని బొమ్ము చంద్రశేఖర్ యాదవ్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వల్లపు కోటేష్, ముక్కమల్ల మహేష్, గుండెబోయిన లింగస్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.