BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 06:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పేదల ఆక్రమణల క్రమబద్ధీకరణకు చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Sep, 2026 - 06:23 PM
15 వీక్షణలు

పేదల ఆక్రమణల క్రమబద్ధీకరణకు చర్యలు అర్హులైన లబ్ధిదారులకు పట్టాల పంపిణీకి ఆహ్వానం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని పాత తిరువూరు రెవెన్యూ గ్రామ పరిధిలో ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్న అర్హులైన పేదల ఆక్రమణలను క్రమబద్ధీకరించి పట్టాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

జీఓ ఎంఎస్ నంబర్ 30 ప్రకారం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అర్హులైన పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో తిరువూరు పట్టణంలోని పాత తిరువూరు రెవెన్యూ గ్రామ పరిధిలో పట్టాల పంపిణీకి అర్హత సాధించిన సుమారు 15 మంది లబ్ధిదారులను కార్యక్రమానికి ఆహ్వానించేందుకు తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ స్వయంగా వారి నివాసాలకు వెళ్లారు. లబ్ధిదారులను పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన పేదల ఆక్రమణలను క్రమబద్ధీకరించి వారికి పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆర్డీఓ ఏ. కుమార్ తెలిపారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.