BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 October 2026, 10:20 pm
Posted by : V శ్రీనివాస్

బతుకమ్మ ఆడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల వినూత్న నిరసన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Oct, 2026 - 10:20 PM
9 వీక్షణలు
  • పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని డిమాండ్
  • పండుగ పూట పస్తులుండాల్సిందేనా అంటూ ప్రభుత్వాన్ని నిలదీత
  • కలెక్టరేట్ ఎదుట ధర్నా.. డీఆర్ఓకు వినతిపత్రం

తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పెండింగ్ బిల్లులు, వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బతుకమ్మ ఆడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపిన అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) రాములుకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రతినెలా అందాల్సిన వేతనాలు, బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

దసరా పండుగ సమీపించినా బిల్లులు చెల్లించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలతో పండుగను ఎలా జరుపుకోవాలని, పిల్లలకు ఆహారం ఎలా అందించాలని, నిత్యావసర సరుకులు ఎలా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతినెలా రూ.10,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు (ఎన్జీవోలకు) అప్పగించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.

అనంతరం మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దాగం రాజారాం మాట్లాడుతూ, రెండు దశాబ్దాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఏళ్లు దాటిన కార్మికులను ఎలాంటి పరిహారం చెల్లించకుండా తొలగించే నిర్ణయాన్ని ఖండించారు. 20 ఏళ్లపాటు సేవలందించిన కార్మికులకు రిటైర్మెంట్ ప్రయోజనంగా రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు, గుడ్లు సరఫరా చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పెండింగ్ బిల్లులు, వేతనాలను వెంటనే విడుదల చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎండీ కరీమా, కార్యదర్శి ఎండీ రఫియా, జిల్లా కోశాధికారి సవిత, ఉపాధ్యక్షులు మధునమ్మ, రబియా, సహాయ కార్యదర్శులు రమాదేవి, సరిత, జ్యోతితో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.