BREAKING
thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
Test 4
Date of Publish : 27 September 2026, 11:59 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

తిరుపతిలో మైనర్ బాలిక అదృశ్యం....

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 Sep, 2026 - 11:59 AM
52 వీక్షణలు

తిరుపతి.

తిరుపతి నగరంలోని కొర్లగుంట కట్ట కింద పల్లెకు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది.

సమాచారం మేరకు.. బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అయితే మరుసటి రోజు కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, పరిచయస్తుల వద్ద ఆరా తీశారు. బాలిక ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు.

బాలిక తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈస్ట్ ఎస్సై స్వాతి ఆధ్వర్యంలో పోలీసులు బాలిక ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు.

బాలిక ఎక్కడికి వెళ్లింది, ఎవరితోనైనా వెళ్లిందా, చివరిసారిగా ఎక్కడ కనిపించింది అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. బాలిక స్నేహితులు, కుటుంబ సభ్యులు, పరిచయస్తులను విచారించడంతో పాటు అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించే అవకాశం ఉంది.

బాలిక ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. మైనర్ బాలిక కావడంతో ఆమె భద్రతకు సంబంధించిన అంశాన్ని పోలీసులు ప్రాధాన్యతగా తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.