గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
పెదకూరపాడు: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ స్వరాజ్యం, సత్యం, స్వచ్ఛత, సేవా మార్గాల ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు.
గాంధీజీ చూపిన సత్యం, స్వచ్ఛత, సేవా మార్గాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దేశ ఐక్యత, గ్రామ స్వరాజ్యం, ప్రజా సంక్షేమం కోసం గాంధీజీ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ జానీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెన్న సాంబశివరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.