BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 07:09 am
Posted by : P GAJENDRA BABU

గాయపడిన ఆలయ సెక్యూరిటీ గార్డ్ కుటుంబానికి ఎమ్మెల్యే బొజ్జల భరోసా

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
P Gajendra Babu Srikalahasthi Constituency Reporter
26 Nov, 2026 - 07:09 AM
28 వీక్షణలు

గాయపడిన ఆలయ సెక్యూరిటీ గార్డు కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా

రూ.20.25 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌ఓసీ మంజూరుకు సిఫార్సు.. ఆలయం తరఫున ఆర్థిక సాయం అందించాలని అధికారులకు ఆదేశం

శ్రీకాళహస్తి: విధి నిర్వహణలో ఆకతాయిల దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ సెక్యూరిటీ గార్డు ధనుంజయ నాయుడు కుటుంబానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బోజ్జల వెంకట సుధీర్ రెడ్డి అండగా నిలిచారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి రూ.20,25,000 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు లేఖ పంపించారు.

ధనుంజయ నాయుడు ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ తక్షణ వైద్య సహాయం అందించాలని బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.వి. అమర్ నాథ్ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి బాధితుడికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.20.25 లక్షల ఎల్‌ఓసీ మంజూరుకు సిఫార్సు చేశారు.

అంతేకాకుండా విధి నిర్వహణలో గాయపడిన ఉద్యోగి కుటుంబాన్ని ఆలయ యాజమాన్యం కూడా ఆదుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తరఫున బాధితుడికి తగిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు అవసరమైన పూర్తి సహకారం కల్పించాలని ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జి.వి. అమర్ నాథ్ మాట్లాడుతూ.. బాధిత ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బోజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూ.20.25 లక్షల ఎల్‌ఓసీ మంజూరుకు సిఫార్సు చేయడంతో పాటు దేవస్థానం తరఫున కూడా ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.

ఎమ్మెల్యే తీసుకున్న చొరవ బాధిత కుటుంబానికి ధైర్యాన్ని, భరోసాను కల్పించిందని పేర్కొన్నారు. ధనుంజయ నాయుడు త్వరగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాలని శ్రీకాళహస్తీశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు జి.వి. అమర్ నాథ్ తెలిపారు.