గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
గుంటూరు: మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, స్వచ్ఛత మార్గాలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు.
గుంటూరులోని కొరిటేపాడులో మహాత్మా గాంధీ విగ్రహానికి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీని కేవలం స్వాతంత్ర్య సమరయోధుడిగా మాత్రమే కాకుండా, సత్యం, అహింస వంటి విలువలను తన జీవితంలో ఆచరించిన వ్యక్తిగా స్మరించుకోవాలని అన్నారు. యువత గాంధీజీ సిద్ధాంతాల నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు.
లాల్ బహదూర్ శాస్త్రి దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతకు ప్రతీకగా నిలిచారని గళ్ళా మాధవి పేర్కొన్నారు. దేశం కోసం గాంధీ, శాస్త్రి చేసిన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.