BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 03:42 pm
Posted by : K MAHESH

రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 03:42 PM
15 వీక్షణలు

అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సంవిధాన్ రక్షా మార్చ్

హైదరాబాద్: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’ (రాజ్యాంగ పరిరక్షణ యాత్ర)లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి యాత్రలో భాగస్వాములయ్యారు.

భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య, లౌకిక, సామాజిక న్యాయం, సమానత్వ విలువలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కొనసాగింది.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వరులు, పోతుల శ్రీమాన్, జక్కుల రవీందర్, వేముల శ్రీనివాస్, నెక్కొండ కవిత, కిషన్, తాడిచెట్టి విద్యాసాగర్, ఎనుకొటి నాగరాజు, పుప్పాల ప్రభాకర్, చీకటి ఆనంద్, నలుబోల సతీష్, వీరగంటి రవీందర్, ఐఎన్‌టీయూసీ చైర్మన్ కూర వెంకట్, మైనార్టీ సెల్ చైర్మన్ అజీజుల్లా బేగ్, మీడియా సెల్ చైర్మన్ మార్క విజయ్ తదితరులు పాల్గొన్నారు.