BREAKING
thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Date of Publish : 07 October 2026, 06:45 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 06:45 AM
16 వీక్షణలు

స్ధానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా వుండాలని అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరు, అక్టోబర్ 6: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి ఎంపీడీవోలు, పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం త్వరలో పురపాలక సంఘాలు, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను ముందుగానే సిద్ధం చేసి తనిఖీ చేయాలని సూచించారు.

జిల్లాలో పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేలా ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవోలు, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అన్ని వసతులు ఉన్నాయా లేదా పరిశీలించాలన్నారు. లోపాలు లేదా సమస్యలు గుర్తిస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని సూచించారు.

పోలింగ్, కౌంటింగ్, పోలింగ్ సామగ్రి నిల్వ, పంపిణీ కేంద్రాల్లో కాంపౌండ్ వాల్, విద్యుత్, ఇంటర్నెట్, భద్రత తదితర మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు.

పోలింగ్ కేంద్రాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, కాంపౌండ్ వాల్స్, విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలతో పాటు భవనాల పటిష్టతను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ ఇన్‌చార్జి సీఈఓ మల్లికార్జునరావు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.