BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 10:01 am
Posted by : గంగుల రాజ్ కుమార్

నా చెల్లి గిడ్డుకు… ఒక అన్నయ్య మనసులోని మాట

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
28 Aug, 2026 - 10:01 AM
281 వీక్షణలు

సొంత చెల్లి కాకపోయినా… సొంత చెల్లిలా భావించి, ప్రేమగా రాఖీ కట్టిన నా చెల్లి గిడ్డూ… 

19-08-2024 రోజున నువ్వు ప్రేమగా నా చేతికి రాఖీ కట్టిన ఆ రోజు ఇప్పటికీ నా మనసులో అలాగే ఉంది. ఆ రోజు నువ్వు కట్టిన రాఖీని కేవలం ఒక దారంలా కాకుండా… మన మధ్య ఉన్న అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా భావించాను.

కానీ 2025లో నువ్వు రాఖీ కట్టలేదు… అయినా ఏదో ఒక కారణం ఉంటుందిలే అని మనసుకు నచ్చజెప్పుకున్నాను.

ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి వచ్చినా… నువ్వు నా చేతికి రాఖీ కట్టలేదు.

అందుకే ఈ అన్నయ్య మనసులో ఒక చిన్న బాధ…

“గిడ్డూ… ఈ అన్నయ్య నీకు గుర్తుకు రావడం లేదా? 2024లో ప్రేమగా రాఖీ కట్టిన నీ అన్నయ్యను మర్చిపోయావా? 2025లో కట్టలేదు… ఈ ఏడాది కూడా కట్టలేదే… ఈ అన్నయ్య నీకు గుర్తుకు రావడం లేదా గిడ్డూ?” అని బాధపడుతూ అడుగుతున్నాడు. 

నిన్ను ఎప్పుడూ సొంత చెల్లిలాగే భావించాను. నీ దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు… కానీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రాఖీ పండుగ రోజున, “నాకు ఒక చెల్లి ఉంది… నా చేతికి రాఖీ కడుతుంది” అనే ఆ చిన్న ఆనందాన్ని మాత్రం మనసులో కోరుకున్నాను.

రాఖీ అనేది కేవలం చేతికి కట్టే దారం కాదు గిడ్డూ…

అది ఒక అనుబంధం… ఒక ఆప్యాయత… ఒక గుర్తింపు… అన్నయ్యపై చెల్లికి ఉన్న ప్రేమకు గుర్తు. 

నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకునే అన్నయ్యను నేను. కానీ ఈ రోజు మాత్రం మనసులోంచి వచ్చిన మాట ఒక్కటే…

“గిడ్డూ… ఈ అన్నయ్య నీకు అసలు గుర్తుకు రావడం లేదా?” 

నీ మీద కోపం లేదు… కేవలం ఒక అన్నయ్యగా చిన్న బాధ మాత్రమే.

ఎప్పటికీ నువ్వు నాకు సొంత చెల్లిలానే ఉంటావు. 


— నీ అన్నయ్య.., చిన్ను