BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 08 August 2026, 08:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేహా బోరాపై దాడి హేయమైన చర్య డి.హరినాధ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Aug, 2026 - 08:56 AM
116 వీక్షణలు

నేహా బోరాపై దాడి హేయమైన చర్య డి.హరినాధ్

విస్సన్నపేట: రాంచీలో ఏఐఎస్ఏ–ఆర్‌వైఏ ఆధ్వర్యంలో పేపర్ లీకేజీలు, పరీక్షల అవినీతికి వ్యతిరేకంగా నిర్వహించిన శాంతియుత ర్యాలీలో ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాపై దాడి చేయడం హేయమైన చర్య అని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడటం పిరికితనానికి నిదర్శనమని, ఇలాంటి చర్యలు దాడులకు పాల్పడుతున్న వారి రాజకీయ దివాళాకోరుతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయని హరినాథ్ విమర్శించారు. నేహా బోరాతో పాటు మహిళా ఉద్యమకారులపై దాడి చేసి సిరా చల్లడం ద్వారా ఉద్యమకారులను భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించడం మతోన్మాద, ఫాసిస్ట్ శక్తుల దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు.

పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటున్నప్పటికీ, వాటిపై ప్రశ్నలు లేవనెత్తుతున్న విద్యార్థులు, ఉద్యమకారులపై గూండాలను ఉసిగొల్పడం సిగ్గుచేటని హరినాథ్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించాలని, విద్యార్థి ఉద్యమాలను అణచివేసే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

నేహా బోరాపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, దాడి వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని హరినాథ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీకేజీలపై సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులెవరైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే విధానాలకు స్వస్తి పలికి, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచాలని ఆయన అన్నారు.