వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
మార్కాపురం: ప్రస్తుత జాబితాలో పేర్లు లేవని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు.
ప్రస్తుత జాబితాలో చోటు దక్కని పేర్లపై జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేకంగా విచారణ చేయిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి నిర్వాసితుడికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిశీలించి, అర్హత ఉన్న వారికి న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.