BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 05:50 pm
Posted by : PEDDABOINA SRIKANTH

భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
22 Sep, 2026 - 05:50 PM
18 వీక్షణలు

ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో సివిల్ జడ్జి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుబాటులో ఉన్న న్యాయపరమైన సమాచారం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

భూమి కొనుగోలు చేసే సమయంలో కేవలం పట్టా పాస్‌బుక్‌ను మాత్రమే పరిశీలించకుండా, సంబంధిత భూమికి సంబంధించిన అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. సర్వే నంబర్, భూమి యాజమాన్య హక్కులు, గతంలో ఆ భూమి ఎవరి పేరుపై ఉంది, ప్రస్తుత యజమానికి ఆ భూమి ఏ విధంగా సంక్రమించింది తదితర వివరాలను తెలుసుకోవాలని వివరించారు.

భూమికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. అవసరమైన వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద సంబంధిత అధికారులను సంప్రదించి సమాచారం పొందే అవకాశం ఉందని వివరించారు.

భూమి కొనుగోలు చేసే ముందు న్యాయపరమైన పత్రాలను పూర్తిగా పరిశీలించాలని, వీలైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)ను పరిశీలించడం ద్వారా గతంలో ఆస్తికి సంబంధించిన లావాదేవీల వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు.

పట్టా పాస్‌బుక్, సర్వే నంబర్, భూ యజమాని వివరాలతో పాటు భూమి వాస్తవంగా ఎవరి ఆధీనంలో ఉంది, కాస్తులో ఎవరు ఉన్నారు అనే అంశాలను కూడా పరిశీలించాలని సూచించారు. భూమి కొనుగోలు చేసే ముందు అవకాశం ఉన్న మేరకు సంబంధిత స్థలాన్ని సర్వే చేయించి, రికార్డుల్లో ఉన్న వివరాలు క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోతున్నాయా లేదా పరిశీలించుకోవాలని తెలిపారు.

భూముల కొనుగోలు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పత్రాలు, యాజమాన్య హక్కులు, రికార్డులు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాలని న్యాయ విజ్ఞాన సదస్సులో సూచించారు.

ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జి, రెవెన్యూ అధికారులు, మండల అధికారులు, ఎల్కతుర్తి గ్రామ సర్పంచ్, ఎంపీడీవో, పోలీస్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.