BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 08:19 pm
Posted by : PEDDABOINA SRIKANTH

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
22 Sep, 2026 - 08:19 PM
11 వీక్షణలు

వరంగల్: వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలను త్వరితగతిన ప్రారంభించాలని మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టారని, అయితే నిర్మాణం పూర్తయినప్పటికీ వైద్య సేవలు ప్రారంభించడంలో జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు.

ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రి పాత భవనంలో కొనసాగుతున్న పరిస్థితుల్లో రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఇటీవల ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు ప్లాస్టర్ కొంత భాగం కూలి పలువురికి స్వల్ప గాయాలైన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఈ ఘటనలో రోగులు, వారి సహాయకులు గాయపడినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వినోద్‌కుమార్ అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు సురక్షితమైన వాతావరణంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం డిసెంబర్‌లో ఆసుపత్రిని ప్రారంభించే లక్ష్యంతో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది.