BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 08:17 pm
Posted by : THUNIKI NAGARAJU

అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం

తెలంగాణ
/ తెలంగాణ
Reporter
Thuniki Nagaraju రాయికల్ మండల ప్రతినిధి
22 Sep, 2026 - 08:17 PM
40 వీక్షణలు

రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి గ్రామంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రాధాన్యత, దాని విశిష్టత, ప్రాచీన జీవన విధానంలో ఆరోగ్య పరిరక్షణకు ఉన్న ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు ఆయుర్వేద వైద్య విధానంపై అవగాహన పెంచుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు సూచించారు.

అనంతరం యోగా శిక్షకుల పర్యవేక్షణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగా సాధనలో పాల్గొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడే సూర్యనమస్కారాలు, ప్రాణాయామం తదితర సాధనలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సునీత, గ్రామ సర్పంచ్ గౌతమి-వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిరణ్, ఫార్మాసిస్ట్ జ్యోతి, ఆశా వర్కర్ లక్ష్మి, యోగా శిక్షకులు లింగమూర్తి, శ్రీధర్, సమత పాల్గొన్నారు.

పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, రవికుమార్, రాజశేఖర్, రాజన్న, శంకరయ్య, మల్లారెడ్డి, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.