పెనుగొలనులో నగర సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం
లోక కళ్యాణార్థం నగర సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నగర సంకీర్తన వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం శిరిడి సాయిబాబా మందిరం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన రేడియో రూము, వాటర్ ట్యాంక్ రోడ్డు, బస్టాండ్, బొడ్రాయి సెంటర్, రామాలయం మీదుగా కొనసాగింది. భక్తులు ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, శ్రీరామ, జయరామ, జయజయరామ నామాలను భక్తిశ్రద్ధలతో పారాయణం చేశారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ చాలీసా పారాయణం
పెనుగోలు గ్రామంలోని బొడ్రాయి సెంటర్‌లో ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహం వద్ద శనివారం రాత్రి భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బంధం అంజయ్య కుమారుడు కృష్ణ సహకారంతో భక్తులకు వివిధ రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను బొలగాని నాగయ్య, కోట దాసు, పసుమర్తి లక్ష్మణరావు, పాశం వెంకటేశ్వర్లు తదితరులు పర్యవేక్షించారు.