BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 11:43 am
Posted by : K MAHESH

జాతీయస్థాయి ఎస్జీఎఫ్ కబడ్డీ శిక్షణ శిబిరానికి నారాయణపురం గురుకుల విద్యార్థి తరుణ్ ఎంపిక

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 11:43 AM
14 వీక్షణలు

రాష్ట్రస్థాయి అండర్-14 పోటీల్లో తృతీయ స్థానం.. పాఠశాలకు గర్వకారణం

నారాయణపురం, నవంబర్ 26:

నారాయణపురం గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి ఎం. తరుణ్ కబడ్డీ క్రీడలో ప్రతిభ చాటుకున్నాడు. అండర్-14 రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ (SGF) కబడ్డీ పోటీల్లో తన ఆటతీరుతో ఆకట్టుకుని తృతీయ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా తృతీయ బహుమతిని అందుకున్నాడు.

రాష్ట్రస్థాయి పోటీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా తరుణ్ జాతీయస్థాయి ఎస్జీఎఫ్ కబడ్డీ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. ఈ ఎంపికతో పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమైంది.

విద్యార్థి విజయానికి కృషి చేసిన పీఈటీ గిరిబాబుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తరుణ్‌ను నిరంతరం ప్రోత్సహించిన పాఠశాల ప్రిన్సిపాల్ సమత, ఎస్వీపీ సత్యనారాయణ, జేవీపీ వెంకటనారాయణతో పాటు ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

భవిష్యత్తులోనూ తరుణ్ మరిన్ని విజయాలు సాధించి జాతీయస్థాయిలో రాణించాలని పాఠశాల సిబ్బంది ఆకాంక్షించారు.