BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 09:35 pm
Posted by : కూనురు మధు

బంగారం రికవరీ వ్యవహారంలో నార్కట్ పల్లి ఎస్‌ఐపై వేటు

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
08 Oct, 2026 - 09:35 PM
11 వీక్షణలు

NTODAY NEWS: నార్కట్‌పల్లి

నల్లగొండ జిల్లా  నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగతనం కేసులో బంగారం రికవరీ వ్యవహారం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దొంగతనం కేసులో నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారంలో కొంత పక్కదారి పట్టించారనే ఆరోపణలు తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలో నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఐని జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, బంగారం రికవరీ వ్యవహారంలో మరో పోలీసు అధికారిపై కూడా ఆరోపణలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సదరు అధికారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పోలీసు శాఖలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కీలక పోలీసు అధికారితో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయనకు రక్షణ లభిస్తోందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవమెంతన్నది అధికారికంగా తేలాల్సి ఉంది. బంగారం రికవరీ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారుల తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం బంగారం రికవరీ అంశం ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.