BREAKING
thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
Test 4
Date of Publish : 12 November 2026, 01:13 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరిలొని శాఖా గ్రంథాలయంలో ఈనెల 14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
12 Nov, 2026 - 01:13 PM
1 వీక్షణలు

వారం రోజుల పాటు వివిధ సాంస్కృతిక, సాహిత్య, విద్యా కార్యక్రమాలు

కనిగిరి: కనిగిరిలోని శాఖా గ్రంథాలయంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు గ్రంథపాలకుడు అహ్మద్ షరీఫ్ తెలిపారు. వారం రోజుల పాటు విద్యార్థులు, మహిళలు, పుస్తక ప్రియులను భాగస్వాములను చేస్తూ వివిధ కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా వారోత్సవాల కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 14న వారోత్సవాల ప్రారంభోత్సవంతో పాటు బాలల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 15న పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. 16న గ్రంథాలయ ఉద్యమకారుల సేవలు, వారి కృషిపై ప్రసంగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 17న కవి సమ్మేళనం ఏర్పాటు చేయనున్నారు.

అలాగే 18న విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం తదితర పోటీలు నిర్వహించనున్నారు. 19న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ప్రత్యేక పోటీలు ఏర్పాటు చేయనున్నారు. చివరి రోజైన 20న వారోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించి, వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేయనున్నారు.

గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు గ్రంథపాలకుడు అహ్మద్ షరీఫ్ తెలిపారు. విద్యార్థులు, మహిళలు, సాహిత్యాభిమానులు, పుస్తక ప్రియులు వారోత్సవాల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.