BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 06:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ ఎంపిక..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Sep, 2026 - 06:43 PM
8 వీక్షణలు

చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ ఎంపిక.. 28 మంది విద్యార్థులు ఎంపిక

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా: చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాతీయ క్యాడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌సీసీ) ఎన్‌రోల్‌మెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. 19(ఏ) బెటాలియన్‌ ఎన్‌సీసీ ఏలూరు కమాండింగ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ అమిత్‌ పాండే ఆదేశాల మేరకు, కళాశాల ఎన్‌సీసీ అధికారిణి లెఫ్టినెంట్‌ జి. జీవన మౌనిక ఆధ్వర్యంలో 19(ఏ) బెటాలియన్‌ పీఐ సిబ్బంది విద్యార్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు.

ఎన్‌రోల్‌మెంట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ దశల్లో నిర్వహించిన ఎంపిక ప్రక్రియ అనంతరం 17 మంది ఎస్‌డీ (సీనియర్‌ డివిజన్‌), 11 మంది ఎస్‌డబ్ల్యూ (సీనియర్‌ వింగ్‌) విభాగాల్లో కలిపి మొత్తం 28 మంది విద్యార్థులు ఎన్‌సీసీ క్యాడెట్లుగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డా. పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్‌సీసీ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సేవాభావంతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని అన్నారు. ఎన్‌సీసీ శిక్షణలో భాగంగా బి, సి సర్టిఫికెట్లు సాధించే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు.

ఎన్‌సీసీ క్యాడెట్లుగా ఎంపికైన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు అభినందించారు.