BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 10:01 am
Posted by : K MAHESH

ద్వారకపేటలో నూతన విద్యుత్ ఉపకేంద్రం.. త్వరలో ప్రారంభం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 10:01 AM
13 వీక్షణలు

నిర్మాణ పనులు, సాంకేతిక అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విద్యుత్ శాఖ అధికారులు

నర్సంపేట, నవంబర్ 26:

నర్సంపేట పరిధిలోని ద్వారకపేటలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వరంగల్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆనంద్, నర్సంపేట డివిజనల్ ఇంజనీర్ తిరుపతి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు లక్ష్మణ్, రాజేష్, అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్ భాస్కర్‌తో పాటు సంబంధిత సిబ్బంది నిర్మాణ స్థలాన్ని సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఉపకేంద్రం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు, సాంకేతిక అంశాలపై అధికారులు సమీక్షించారు. ఉపకేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించి వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపారు.

నూతన విద్యుత్ ఉపకేంద్రం అందుబాటులోకి వస్తే నర్సంపేట పరిధిలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తద్వారా వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు వీలవుతుందని తెలిపారు.