BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:14 pm
Posted by : KOLA MAHESH

మళ్లీ వాయిదా పడిన నామినేటెడ్ పోస్టుల భర్తీ

తెలంగాణ
/ నల్గొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 02:14 PM
14 వీక్షణలు

యాదాద్రి–నల్గొండ జిల్లాల్లో ఆశావహులకు తప్పని ఎదురుచూపులు.. నియామకాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

నల్గొండ, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కుదరకపోవడమే నియామకాల జాప్యానికి కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావహుల్లో నిరీక్షణ కొనసాగుతోంది.

పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు

చైర్మన్లు, డైరెక్టర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర పార్టీ పదవులను ఆశిస్తున్న పలువురు నాయకులు ఇప్పటికే తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పోస్టుల భర్తీపై పలుమార్లు ఆశలు పెట్టుకున్నప్పటికీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారు. తమకు ఎప్పుడు అవకాశం లభిస్తుందోనని ఎదురుచూస్తున్నారు.

డిసెంబర్ 7లోగా భర్తీకి కసరత్తు?

డిసెంబర్ 7లోగా నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని టీపీసీసీ స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆశావహుల దృష్టి పార్టీ అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయంపై కేంద్రీకృతమైంది.

అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ

జిల్లాల వారీగా ఎవరికి అవకాశం దక్కుతుంది? పెండింగ్‌లో ఉన్న నియామకాలు ఎప్పుడు పూర్తవుతాయి? అనే అంశాలపై కాంగ్రెస్ నాయకుల్లో ఆసక్తి నెలకొంది. అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే నియామకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.