విజయవంతంగా ముగిసిన ఎన్టీఆర్ జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు
విజయవాడలోని ప్రతిభ సివిల్స్ అకాడమీలో ఆదివారం ఎన్టీఆర్ జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి 41 విద్యార్థి బృందాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.
కార్యక్రమానికి జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోపాళం శివన్నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ఇష్టంతో చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.
విజేతలు
ప్రభుత్వ పాఠశాలల విభాగం:
ప్రథమ స్థానం: పి.వి. సుబ్బారెడ్డి హైస్కూల్, విజయవాడ
ద్వితీయ స్థానం: జి.డి.ఈ.టి.ఎం.సి. హైస్కూల్, పడమట, విజయవాడ
తృతీయ స్థానం: జి.డి.ఈ.టి.ఎం.సి. హైస్కూల్, పడమట, విజయవాడ
ప్రైవేట్ పాఠశాలల విభాగం:
ప్రథమ స్థానం: గౌతమ్ హైస్కూల్, మైలవరం
ద్వితీయ స్థానం: తపోవనం హైస్కూల్, జగ్గయ్యపేట
తృతీయ స్థానం: గాయత్రీ హైస్కూల్, తోటమూల
కార్యక్రమంలో జనవిజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షులు వి. మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్, రాష్ట్ర కార్యదర్శి బి. రవి, చెకుముకి కన్వీనర్ షేక్ ఇమామ్, నాయకులు ఎం. హరికృష్ణ, వెలగ శ్రీనివాస్, రత్న కమల్, ఉషారాణి, కోటేశ్వరరావు, భాను ప్రసాద్, సర్దార్, వంశీ, సురేంద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.