BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 10 October 2026, 10:25 am
Posted by : SEETHA KIRAN KUMAR

తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ.. పితృదేవతలకు నైవేద్యం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
10 Oct, 2026 - 10:25 AM
15 వీక్షణలు

నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10 (ఎన్‌ టుడే న్యూస్‌):

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజున ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకుంటారు. ఇదే రోజు మహాలయ అమావాస్య కావడంతో పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహిస్తారు.

సంప్రదాయం ప్రకారం ముందు రోజు సేకరించిన పూలతో బతుకమ్మను పేర్చడం, కొన్ని ప్రాంతాల్లో భోజనం చేసిన తర్వాత బతుకమ్మను తయారు చేయడం వల్ల దీనికి ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు వచ్చిందని పూర్వీకులు చెబుతారు.

తొలి రోజు బతుకమ్మకు నువ్వులు, బియ్యప్పిండి లేదా బియ్యపు నూకలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పూలతో బతుకమ్మలను అలంకరించి, పాటలు పాడుతూ ఉత్సవాల్లో పాల్గొంటారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ రాష్ట్రవ్యాప్తంగా సందడి తీసుకురానుంది.