BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 15 October 2026, 09:48 am
Posted by : SEETHA KIRAN KUMAR

మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్లు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
15 Oct, 2026 - 09:48 AM
13 వీక్షణలు

దూరప్రాంతాల రోగులకు ఊరట.. అదే రోజు పరీక్షలు, చికిత్స పొందే అవకాశం

ఇకపై ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్‌ (ఓపీ) రిజిస్ట్రేషన్లను మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నారు. గతంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకే రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండేది. ఈ సమయాన్ని పొడిగించడం వల్ల దూరప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చే రోగులకు ప్రయోజనం కలగనుంది.

ఎంఆర్‌ఐ పరీక్ష మినహా ఇతర వైద్య పరీక్షలను సాధ్యమైనంతవరకు అదే రోజు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల నివేదికలను ఒకటి నుంచి రెండు గంటల్లోనే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో రోగులు పరీక్షల నివేదికల కోసం మరుసటి రోజు వరకు వేచి ఉండాల్సిన అవసరం తగ్గనుంది.

పరీక్షలు, నివేదికలు అదే రోజు పూర్తయితే రోగులు సంబంధిత వైద్యులను సంప్రదించి చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది. వైద్యులు కూడా సాయంత్రం వరకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ మార్పులతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సమయం ఆదా కావడంతో పాటు, దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రయాణ ఖర్చులు, ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.