BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 07 August 2026, 08:32 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పాలకులను నిలదీయాలని సీపీఐ ప్రచార జాతా ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 08:32 AM
69 వీక్షణలు

ఏలూరు, ఆగస్టు 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు ప్రశ్నించి నిలదీయాలని సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార జాతాను స్థానిక పవర్‌పేట రైల్వే స్టేషన్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పాలనలో పేద–ధనిక మధ్య అంతరం మరింత పెరిగిందని ఆరోపించారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై దేశద్రోహం వంటి చట్టాల కింద కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.

విద్య, వైద్య రంగాలు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి సామాన్య ప్రజలకు భారంగా మారాయని, దీంతో సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

ఏలూరు నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, జిల్లాలో డెల్టా ఆయకట్టు భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నప్పటికీ రైతులకు నీరు అందించడం లేదని విమర్శించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని మళ్లించి పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదన్నారు. శాశ్వత ఉద్యోగాలకు బదులుగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ నియామకాలు పెరగడంతో యువత ఉద్యోగ భద్రత కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ, ఉద్యోగ నియామకాల్లో జాప్యం, పరీక్షల పేపర్ల లీకేజీలు, కోర్టు కేసుల కారణంగా యువత భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చడంతో యువతలో నిరాశ పెరిగిందని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజలే ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాల ద్వారా ఎదుర్కోవడమే ఈ ప్రచార జాతా లక్ష్యమని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, సీపీఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శులు కురెళ్ల వరప్రసాద్, అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా, కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, కొండేటి బేబీ, కొల్లూరి సుధారాణి, గొర్లి స్వాతి, సాయన అభిలాష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, బళ్ల కనకదుర్గారావు, కొండేటి రాంబాబు, లక్కోజు జగదీశ్వరి, ఉప్పులూరి లక్ష్మి, భవాని, జ్యోతి, ఎర్ర వెంకటేశ్వరరావు, రాజమణి తదితరులు పాల్గొన్నారు.