BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 06:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను గ్రంథాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 06:43 PM
33 వీక్షణలు

రాజ్యాంగం కల్పించిన సమాన హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శాఖ గ్రంథాలయంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ గొప్పతనాన్ని, ప్రజాస్వామ్య విలువలను గుర్తుచేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందని వివరించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించిందని, కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో జీవించేలా రాజ్యాంగం మార్గదర్శనం చేస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు వాటిని గౌరవించడం, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని అన్నారు. విశ్రాంత బ్యాంకు మేనేజర్ దేవరపల్లి రమేష్ మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లోనే భారతదేశానికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉండటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అపారమైన మేధస్సు, దూరదృష్టి, అంకితభావంతో రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, హక్కులు కల్పించేలా రాజ్యాంగం రూపొందించబడిందని, అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తికి నిజమైన గౌరవం ఇచ్చినవారమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ యువజన అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.