BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 13 August 2026, 01:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను, జింకలపాలెం గ్రామాల్లో ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావుకు ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 01:35 PM
71 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు 38వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా అన్నేపర్తి గ్రామంలో రామయ్య, రాంబాయమ్మ దంపతులకు 1916 జూన్ 10న పైడిమర్రి వెంకట సుబ్బారావు జన్మించారని తెలిపారు. 1962లో విశాఖపట్నంలో ఖజానా అధికారిగా పనిచేస్తున్న సమయంలో విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలల్లో చదివే ‘‘భారతదేశం నా మాతృభూమి’’ అనే జాతీయ ప్రతిజ్ఞను రచించారని వివరించారు. ఆయన రచించిన జాతీయ ప్రతిజ్ఞ 1965 జనవరి 26 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.

వెంకట సుబ్బారావు జాతీయ భావాలను పెంపొందించే రచనలతో పాటు నవలలు, పద్యకావ్యాలు, నాటకాలు, కథలు, అనువాద రచనలు చేశారని తెలిపారు. దేశభక్తి, సామాజిక చైతన్యం, విలువలను ప్రతిబింబించే ఆయన సాహిత్య సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

జింకలపాలెంలోనూ నివాళులు

గంపలగూడెం మండలం పెనుగోలు శివారు జింకలపాలెంలోని ఉర్దూ, తెలుగు మాధ్యమ ప్రాథమిక పాఠశాలలోనూ గురువారం శిరిడీ సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో పైడిమర్రి వెంకట సుబ్బారావు వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ షెహనాజ్ బేగం మాట్లాడుతూ వెంకట సుబ్బారావు గొప్ప దేశభక్తుడని, విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించే జాతీయ ప్రతిజ్ఞను రచించారని తెలిపారు.

అనంతరం శిరిడీ సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పాఠశాలలో నాలుగు, ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.

ఈ రెండు కార్యక్రమాల్లో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, శిరిడీ సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.