BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 16 August 2026, 09:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం పూర్వ విద్యార్థుల మానవత్వం.. మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక భరోసా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 09:42 AM
407 వీక్షణలు

డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002-03 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు.

అదే బ్యాచ్‌కు చెందిన కంకోళం చంద్రశేఖర్ రాజు అలియాస్ పెయింట్ చందు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు చిన్నపిల్లలు కావడంతో కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గమనించిన పదో తరగతి పూర్వ విద్యార్థులు సహాయం చేయాలని నిర్ణయించారు.

చందు చిన్న కుమార్తె హోస్మిజ పాప పేరు మీద రూ.1,03,000లతో బ్యాంకులో ఎఫ్‌డీ ఖాతా ప్రారంభించి డిపాజిట్ చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల చేతుల మీదుగా ఎఫ్‌డీ డిపాజిట్ బాండును చందు భార్యకు అందజేశారు.

ఆపద సమయంలో తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులను గ్రామస్థులు అభినందించారు. స్నేహబంధానికి, మానవత్వానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.