పోలవరంలో 💯 శాతం పూర్తి 1,244 ఇళ్లకు టీడీపీ డోర్ టు డోర్ మరిడి వెంకటేశ్వర రావు (చిట్టిబాబు)
29, 30, 31, 32 బూత్‌లలో వంద శాతం కార్యక్రమం పూర్తి: మరిడి వెంకటేశ్వరరావు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా 29, 30, 31, 32 బూత్‌ల పరిధిలో ఉన్న 1,244 ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించి కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసినట్లు మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు) తెలిపారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు.
ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించినట్లు మరిడి వెంకటేశ్వరరావు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ప్రయోజనాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు.
మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), గ్రామ టీడీపీ అధ్యక్షుడు బిలుగుది జయరాజు, పోలవరం పీఏసీఎస్ అధ్యక్షుడు యర్రా ప్రసాదరావు, తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు చైర్మన్ యర్రా రమేష్, యువ నాయకుడు తక్కెళ్లపాటి రామ్‌శరత్, క్లస్టర్ ఇన్‌చార్జి ములుగుమాటి నవాక్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు మిద్దె పార్థసారథి, సత్తెనపల్లి రాంబాబు, పరసా రాంబాబు, కాలసాని రాంబాబు, వడాలి శ్రీనివాసరాజు, మాకరాజు మణికంఠ, సత్తెనపల్లి శివ, మరీదు రాజు, మాకరాజు సాయి, కాట్రు రవి, కంకోలం రామరాజు, వీరంకి రవితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు మరిడి వెంకటేశ్వరరావు తెలియజేశారు.
పోలవరం గ్రామంలోని నాలుగు బూత్‌ల పరిధిలో ఉన్న మొత్తం 1,244 ఇళ్లను సందర్శించి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయడం సంతోషంగా ఉందని మరిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంటింటికీ వెళ్లడం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు అవకాశం కలిగిందన్నారు.
టీడీపీ చేపట్టిన ఇంటింటి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బలపరచాలని ప్రజలను కోరినట్లు తెలిపారు.
పోలవరం గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారంతో మరింత కృషి చేస్తామని మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు) తెలియజేశారు.