BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 24 June 2026, 09:55 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
24 Jun, 2026 - 09:55 PM
109 వీక్షణలు

విజయవాడ నగరపాలక సంస్థ

ప్రత్యేక సమగ్ర సవరణ శరవేగంగా జరగాలి        విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం సాయంత్రం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా రామలింగేశ్వరపేట, భానునగర్, సూర్యారావుపేట, మధురానగర్, పప్పుల మిల్ సెంటర్, గుణదల ప్రాంతాల్లో పర్యటించి ఫారాల పంపిణీ తీరును పరిశీలించారు. ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి ఫారాలను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (BLOs) అందజేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మరియు సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రజలందరూ బీఎల్‌ఓలకు పూర్తి సహకారం అందించి, తమ వివరాలను సరిచూసుకుని ఎన్యుమరేషన్ ఫారాలను స్వయంగా నింపి సకాలంలో బీఎల్‌ఓలకు తిరిగి అందజేయాలని కోరారు.

అలాగే, ప్రజల నుంచి స్వీకరించిన ఫారాలను బీఎల్‌ఓలు వెంటనే డిజిటలైజేషన్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని నిర్ధారించేలా ప్రతి దశలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.

 పౌర సంబంధాల అధికారి 

 విజయవాడ నగరపాలక సంస్థ