BREAKING
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం
www.ntodaynews.com

పర్వతాపురంలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 12:28 PM
37 వీక్షణలు

పర్వతాపురంలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చాట్రాయి మండల గౌడ సంఘం అధ్యక్షులు భూబత్తుల చెన్నారావు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి, రైతుల సంక్షేమానికి సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితకాలం పాటు కృషి చేశారని కొనియాడారు.

నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు తల్లాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన లచ్చన్న నిస్వార్థ ప్రజాసేవ నేటి తరాలకు ఆదర్శమని అన్నారు.

గౌడ సంఘం నాయకులు, కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతగుంట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గౌడ సంఘీయులంతా ఐక్యతతో ముందుకు సాగి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పర్వతాపురం గ్రామ పార్టీ అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి, మాజీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ మిద్దె శివాజీ, సీనియర్ నాయకులు మిద్దె సత్యనారాయణ, గౌడ సంఘ నాయకులు పలగాని నారాయణ, బయగాని చెన్నారావు, మిద్దె శ్రీనివాసరావు, వాసు, చీపు మల్లేశ్వరరావు, మేకపోతుల వెంకటేశ్వరరావు, బుల్లియ్య తదితర గ్రామ ప్రజలు  కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు మిద్దె రామకృష్ణ పాల్గొన్నారు