BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 05:11 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సీఎం సమావేశం నేపథ్యంలో సూర్యాపేట బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు

తెలంగాణ
/ సూర్యాపేట
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Nov, 2026 - 05:11 PM
25 వీక్షణలు

గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూపులు.. తీవ్ర ఇబ్బందులు పడ్డామని తెలిపిన బాధితులు

సూర్యాపేట:

ముఖ్యమంత్రి సమావేశం నేపథ్యంలో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలతో ప్రయాణించే వారు తీవ్ర అవస్థలు పడ్డారని పేర్కొన్నారు.

బస్సులు సక్రమంగా నడవడం లేదంటూ ఆర్టీసీ అధికారులు నోటీస్ బోర్డుపై ప్రయాణికులకు విజ్ఞప్తి ఉంచారని తెలిపారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయకుండా కేవలం నోటీసుతో సరిపెట్టడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ సమయంలో సామాన్య ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని బాధితులు కోరారు. అదనపు బస్సులు, ప్రత్యామ్నాయ సర్వీసులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.